తెలంగాణ

12 లక్షల మంది బడి పిల్లలకు భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: నగరంలో 12 లక్షల మంది బడి పిల్లల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 29న రవీంద్రభారతిలో పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం, తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవడం కోసం అవసరమైన పలు చర్యలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. నగరంలో 3218 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యతో విద్యార్థులు సతమతమవుతున్నారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ నిర్వహణ, ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి అనుగుణంగా యాజమాన్యాలు సహకరించడం కోసం సమావేశంలో చర్చిస్తారు. పాఠశాలల వద్ద ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ప్రతి ఆటోలో ఆరుగురు విద్యార్థులను మాత్రమే అనుమతించడం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి పాఠశాలల బస్సుల నిర్వహణ చేపట్టడం వంటి అంశాలను చర్చించనున్నారు. దీంతో పాటు పాఠశాలల సమయాల్లో ఒకేసారి రద్దీ ఏర్పడి ట్రాఫిక్ స్థంభించడం, వాహనాల పార్కింగ్, తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు తరచూ నిర్వహించి వారి సలహాలు, సూచనలు నిర్వహించడం చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వీటన్నింటిపైనా సమగ్రంగా చర్చించేందుకు గాను ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి రవాణా శాఖ, జిహెచ్‌ఎంసి అధికారులు, పాఠశాలల తరఫున ఆయా మేనేజ్‌మెంట్ ప్రతినిధులు హాజరు కావాలని ట్రాఫిక్ జెసి వెల్లడించారు.