తెలంగాణ

రాష్ట్రంలో పాలనను మార్చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: తెలంగాణలో కొనసాగుతున్న నియంతృత్వ పాలనను మార్చి తీరుతామని టిజాక్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని టిజాక్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన టిజాక్ స్టీరింగ్ కమిటీ సమావేశమయింది. ఇటీవల సిద్దిపేట, మెదక్‌లో నిర్వహించిన అమరుల స్ఫూర్తి యాత్రతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం కోదండరామ్ అమరుల స్ఫూర్తి యాత్ర విజయవంతమైందన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, నిరుద్యోగం, యువత నిరాశ, నిస్పృహ తమ దృష్టికి వచ్చిందని వీటిపై పోరాటం చేస్తామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక, బ్యాంకులు రుణాలివ్వక రైతులు అల్లాడుతున్నారన్నారు. రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయని తెలిపారు. ఈ కారణంగా ఆత్మహత్యలకు దారి తీస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంజీరా నుంచి సంగారెడ్డి మెదక్‌కు సాగు నీరు అందించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని ఆయన విమర్శించారు. నిజాం చక్కెర పరిశ్రమను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారని ఆయన చెప్పారు. అధికారులు, రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆయన తెలిపారు. మెదక్‌లో విద్యార్థుల చదువులపై, వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదనేది స్పూర్తి యాత్రలో తమ దృష్టికి వచ్చిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయపై అవినీతి ఆరోపణలు ఎక్కువ అయ్యాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ పత్రికల్లో ప్రకటనలకే పరిమితమవుతున్నాయని ఆయన చెప్పారు. పాలనా యంత్రాంగం భ్రష్టు పట్టిందని ప్రజలు విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. ఉద్యోగుల పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్న డిమాండ్ ఉందని అన్నారు. మల్లన్న సాగర్ ప్రాంతం భూగర్భంలో పగుళ్లు ఉన్నందున అక్కడ ప్రాజెక్టు కడితే నిలవదని ఆయన చెప్పారు. అది ఐదు లక్షల మంది ప్రాణాలకు ప్రమాదమని కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రేషన్ డీలర్ల సమ్మెకు టి.జెఎసి మద్దతు ప్రకటించింది.

చిత్రం.. కోదండరామ్