తెలంగాణ

ఆయన ఏ పార్టీకి అనుకూలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూన్ 27: లేని జెఏసికి చైర్మన్‌గా వ్యవహరిస్తూ పనిగట్టుకొని టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్న ప్రొఫెసర్ కోదండరాం అసలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో తేల్చి చెప్పాలని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. నల్ల గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తో కలిసి మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో పదేళ్ళ పాటు తెలంగాణలో కెసిఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు. కెసిఆర్ నిర్వహించిన సర్వేలో 111 సీట్లు టిఆర్‌ఎస్‌కు దక్కుతాయని ఫలితాలు వచ్చాయని రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపిల అడ్రస్ లేకుండా పోవడం ఖాయమని అన్నారు. యుపిలో బిజెపికి అనుకూలంగా ఫలితాలు వచ్చినందుకు బిజెపి వాపును చూసి బలుపు అని భావించినట్లుగా తెలంగాణలో కూడా తాము అధికారంలోకి వస్తామని కలలు కంటోందని, కానీ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి ఒక్క సీటును కూడా గెలవలేదన్నారు. రాష్ట్రంలో పోలీస్‌శాఖ పని తీరు చక్కగా ఉంద ని నాయిని అన్నారు. పోలీస్‌ల పనితీరు దేశంలోనే గుర్తింపు పొందిందని రాష్ట్ర పోలీస్‌లు ఎన్నో క్లిష్టమైన కేసులను సులువుగా పరిష్కరించ గలిగారని ఆయన కితాబును ఇచ్చారు. గ్రామీణ వ్యవస్ధను బలోపేతం చేయాలన్న లక్ష్యం తోనే ముఖ్యమంత్రి కెసిఆర్ యాదవ, కుర్మలకు గొర్రెల పంపిణీ పతకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. బెస్త, గంగపుత్రలను బలోపేతం చేసేందుకు చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను వదిలామన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన పధకాలన్నారు. దేశం లోని మిగిలిన రాష్ట్రాలు ఈ పథకంపై అధ్యయనం చేసి తమ రాష్ట్రాల్లో కూడా ప్రారంభించాలని యత్నిస్తున్నాయన్నారు.