తెలంగాణ

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, జూన్ 27: టిఆర్‌ఎస్ పార్టీ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పిసిసి ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ జిల్లా గంగాధరలో మండల పార్టీ అధ్యక్షుడు రామిడి రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు టిఆర్‌ఎస్‌కు ఓట్లేసారన్నారు. అప్పటి వాగ్ధానాలైన లక్ష రూపాయల రుణ మాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, మూడెకరాల భూమి వంటి పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రస్తుత సీజన్‌లో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం దళారులను ఆశ్రయిస్తూ నకిలీ విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయడం ద్వారా పెద్దఎత్తున రైతులు నష్టపోయే ప్రమాదం నెలకొందన్నారు.
రైతులు మార్కెట్ యార్డులకు తీసుకువచ్చిన ధాన్యాన్ని 24 గంటల్లో కొనుగోలు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న ఆ శాఖ మంత్రి మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయని తీవ్రంగా విమర్శించారు. నగదుకోసం రైతులు బ్యాంకుల చుట్టు తిరుగుతున్నా సర్కార్ పట్టించుకోకపోవడంతోనే రైతుల ధాన్యం అమ్మిన డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లడం ద్వారా ఐదు వేలు, పది వేలు ఇవ్వడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, రైతుల ఆత్మహత్యల ఉసురు ముఖ్యమంత్రికి తగులుతుందన్నారు. రుణమాఫీ బ్యాంకు లు వడ్డీకిందనే జమ చేసుకోగా, వచ్చే సంవత్సరం నుండి ఎకరాకు నాలుగు వేల రూపాయలు రైతులకు పెట్టుబడిగా అందిస్తానని బూటకపు వాగ్ధానాలు చేస్తూ మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య మాట్లాడుతూ ఆ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు కార్యకర్తల అభీష్టం మేరకు పనిచేస్తామన్నారు. మాజీ ఎంపిపి పెర్కపల్లి కిషన్, సర్పంచ్‌లు వైద రామానుజం, బత్తిని సత్యనారాయణ, ఎంపిటిసి చిప్ప లావణ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమికి పవన్ కుమార్, యూత్ కాంగ్రెస్ పార్లమెంటు అధ్యక్షుడు నాగి శేఖర్, రోమాల రమేష్, శ్రీనివాస్ గౌడ్, కొలిపాక స్వామి, భట్టు లక్ష్మినారాయణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.