తెలంగాణ

అద్దెగర్భం తల్లుల సంరక్షణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: సంతాన సాఫల్య కేంద్రాలపై దాడి చేసిన కేసులో కనుగొన్న సరోగేట్ తల్లులు (అద్దె గర్భం తల్లులు) సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సంరక్షణ, సంక్షేమ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ అనే హైకోర్టు న్యాయమూర్తి రాసిన లేఖను ధర్మాసనం సుమోటోగా స్వీకరించి విచారించింది. కోర్టు ఆదేశంపై ప్రభుత్వ అధికారులు నివేదిక ఇచ్చారు. తాము దాడులు నిర్వహించిన బంజారాహిల్స్‌లోని సాయి కిరణ్ హాస్పిటల్, కిరణ్ సంతాన సాఫల్య కేంద్రాన్ని కేవలం ఇన్‌ఫర్టిలిటీ, ఆల్ట్రా సౌండ్ స్కాన్ కోసమే నిర్వహిస్తున్నట్లు అనుమతి ఉందన్నారు. డాక్టర్ సమిత్ శేఖర్ అనే వైద్యుడు ఎంబిబిఎస్ మాత్రమే చదువుకున్నారని తెలిపారు. గైనకాలజీ, యూరాలజీ, క్లినికల్ ఎంబ్రియాలజీ, ఆండ్రాలజీ వైద్య నిపుణులను కౌనె్సలర్లుగా నియమించారనానరు. 48 సరోగసీ తల్లులు పేద వర్గాలకు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. సరోగసీపై ఒప్పందపత్రాలు కూడా లేవన్నారు. 48 మందిలో 37 మంది గర్భవతులని, 10 మంది సరోగసీ కోసం వేచిచూస్తున తల్లులని పేర్కొన్నారు. ఆసుపత్రికి షోకాజ్ నోటీసు ఇచ్చామని, జవాబు కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా సరోగసి తల్లుల ద్వారా సంతానం పొందాలనుకున్న దంపతులు తమకు సరోగసి తల్లుల పరిరక్షణకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. రాష్ట్ర వైద్య శాఖ డైరెక్టర్ సరోగసి తల్లుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును మూడు వారాల పాటు కోర్టు వాయిదా వేసింది.