తెలంగాణ

సత్ప్రవర్తనతోనే గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: పోలీసులు సత్ప్రవర్తనతో సేవలందిస్తే మంచి గుర్తింపు వస్తుందని, పోలీసులు ప్రజలకు మరింత చేరువవ్వాలని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ సూచించారు. గురువారం ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమిలో ‘పోలీస్-ప్రజాసంబంధాలు-పిఆర్‌ఓ’లపై రెండు రోజుల వర్కుషాపును డిజిపి అనురాగ్‌శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో పోలీస్ అంటే సద్భావన కలిగేలా పనిచేయాలని, ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని డిజిపి సూచించారు. ఇంటర్నెట్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలకు ఫిర్యాదులపై అవగాహన కల్పించాలని, ప్రజల ఫిర్యాదులను స్పందించి వెంటనే పరిష్కారాన్ని కనుగొని ఫిర్యాదుదారులకు తోడ్పడాలని డిజిపి సూచించారు.
ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం, కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ స్టీవెన్సన్ మాట్లాడుతూ, పోలీసులు అంటే ప్రజల్లో మంచి అభిప్రాయం తీసుకురావాలని సూచించారు. ప్రజల్లో మమేకమై పనిచేయాలన్నారు. ప్రజలకు, పోలీసులకు మధ్య పిఆర్‌ఓల పాత్ర ఎంతో గొప్పదని, పిఆర్‌ఓలు ప్రజా సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు.

చిత్రం.. వర్కుషాపులో ప్రసంగిస్తున్న డిజిపి అనురాగ్ శర్మ