తెలంగాణ

కార్యకలాపాలు ప్రారంభించని గనుల లీజు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: ఇంకా కార్యకలాపాలు ప్రారంభించని గనుల లీజును రద్దు చేయనున్నట్టు గనుల శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. లీజులు పొంది గడువులోగా కార్యకలాపాలు జరపకుండా పడి ఉన్న గనులపై చర్యలు తీసుకోవాలని గనుల శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. లీజుల పత్రంలోని నిబంధనల మేరకు మైనింగ్ ప్రారంభించి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం లభించడంతో పాటు పలువురికి ఉపాధి లభించేదని అన్నారు. నిబంధనలు పాటించని వాటికి మార్గదర్శకాలకు అనుగుణంగా నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఈ గనుల యాజమాన్యాలకు నోటీసు ఇచ్చి, వాటి లీజులను రద్దు చేయాలని చెప్పారు. ఈ గనులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వారం రోజుల్లోగా నోటీసులు ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ప్రమాణాలు పాటించకుండా మైనింగ్ చేస్తున్న వారిపైనా, అలాంటి క్వారీలపైన కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని అధికారులను మంత్రి అభినందించారు. మైనింగ్ శాఖలో ఉన్నత ప్రమాణఆలు నెలకొల్పేందుకు అవసరం అయిన టెక్నాలజీని వాడాలని చెప్పారు. తనీఖీలను డిజిటలైజ్ చేసేందుకు ఐటి సంబంధిత సాంకేతిక సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పలు శాఖల్లో ఈ మేకు జరుగుతున్న ప్రయత్నాలను తెలుసుకోవాలని సూచించారు. తనిఖీలను రియల్ టైం మానిటరింగ్ చేసేందుకు తనిఖీల నివేదికలను కార్యక్షేత్రం నుంచే పంపేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు అవసరం అయితే క్షేత్ర స్థాయి తనిఖీలకు వెళ్లే అధికారులకు ట్యాబ్‌లు అందించాలని చెప్పారు. దీంతో పాటు ప్రతి గని నీ జియో ట్యాగ్ చేస్తూ, లీజు హద్లును దాటి మైనింగ్ చేయకుండా జియో పెన్సింగ్ చేయాలని ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాలు అన్నీ వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు. గనుల శాఖ రూపొందించిన వెబ్ పోర్టల్‌ను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ పోర్టల్‌లో తెలంగాణ గనుల గురించి పూర్తి సామచారం ఉంటుందని, ఈ పోర్టల్ ద్వారానే గనుల శాఖకు చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారా చేయవచ్చునని తెలిపారు. గనుల శాఖలో ఐటి వినియోగం ద్వారా పారదర్శకత పెరుగుతుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గనుల శాఖ, టియస్ ఎండిసి అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. గురువారం హైదరాబాద్‌లో గనులశాఖ రూపొందించిన వెబ్‌పోర్టల్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కెటిఆర్