తెలంగాణ

ఎస్టీలకు కొత్తగా 21 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: రాష్ట్రంలో ఎస్టీల కోసం కొత్తగా 21 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ , ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ తుది నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతలో 21 ప్రాంతాల్లో 21 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఏడు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు బాలుర కోసం కాగా, 14 రెసిడెన్షియల్ కాలేజీలు బాలికల కోసం ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, మరిపెడ, మణుగూరులలో బాలుర రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తారు. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, జనగామ, ఉట్నూరు, ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, దేవరకొండ సిరిసిల్లలలో ఎస్టీ బాలికల కోసం రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేస్తారు.