తెలంగాణ

టిఎస్ పిఇసెట్ -2017 ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ వ్యాయామ విద్యా కళాశాలల్లో బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన పిఇసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. బిపిఇడిలో టాప్-3 ర్యాంకుల్లో తొలి ర్యాంకును వనపర్తికి చెందిన రాళ్ల నవత, రెండో ర్యాంకు వరంగల్‌కు చెందిన అశ్విని, మూడో ర్యాంకు చర్లకు చెందిన శ్రీను దక్కాయి. డిపిఇడిలో టాప్-3 ర్యాంకుల్లో తొలి ర్యాంకును భూపాలపల్లి జిల్లా కు చెందిన రజిత, రెండో ర్యాంకు నల్గొండకు చెందిన సంధ్య, మూడో ర్యాంకును ఆత్మకూరుకు చెందిన అనూష దక్కించుకున్నారు. బిపిఇడికి 4143 మంది, డిపిఇడికి 3898 మంది దరఖాస్తు చేశారు. అందులో బిపిఇడికి 2865 మంది, డిపిఇడికి 2788మంది హాజరయ్యారు. అందులో బిపిఇడికి 2776 మంది, డిపిఇడికి 2726 మంది అర్హత సాధించారు. బిపిఇడిలో 2287 మంది పురుషులు, 489 మంది స్ర్తిలు, డిపిఇడిలో 2056 మంది పురుషులు, 670 మంది స్ర్తిలు ఎంపికయ్యారని కన్వీనర్ వివరించారు.