తెలంగాణ

జిఎస్‌టితో రైతులు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: జిఎస్‌టితో రైతులు కుదేలవుతారని సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లపై పన్ను, బ్యాంకుల్లో సేవా పన్ను వసూలు చేస్తారని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. వ్యవసాయం అంటే ఆసక్తి తగ్గే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ పథకం హామీకే పరిమితమైందని ఆయన విమర్శించారు. 15 రోజుల్లు పంట రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్‌బిసి నిర్వహించి అప్పుల మీద స్పష్టత ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. కేవలం హామీలతో కాలక్షేపం చేస్తున్నదని ఆయన విమర్శించారు.
నేను అద్వానీ వంటివాన్ని
రాష్ట్ర కాంగ్రెస్‌లో తాను బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర మంత్రి ఎల్‌కె అద్వానీ వంటి వాన్ని అని జానారెడ్డి తెలిపారు. అదేమిటని ప్రశ్నించగా, బిజెపిలో అద్వానీకి మంచి పేరు ఉంది కానీ ఉన్నతమైన స్థానం లభించలేదని, తనకూ పార్టీలో, కార్యకర్తల్లో మంచి పేరున్నా ఉన్నతమైన పదవిని అలంకరించలేదన్నారు.
షబ్బీర్ అలీ ఆవేదన
కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ జిఎస్‌టితో బీడి కార్మికులు 28 శాతం పన్ను చెల్లించాల్సి రావడంతో 10 లక్షల కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్స్‌టైల్, గ్రానైట్ పరిశ్రమ మూత పడే ప్రమాదం ఉందన్నారు. జిఎస్‌టిని ధైర్యంగా వ్యతిరేకించే ధైర్యం ముఖ్యమంత్రికి లేదన్నారు.
కేంద్రంపై పోరాటం చేస్తే: పొంగులేటి
కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తే మద్దతునిస్తామని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. జిఎస్‌టిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
మానవీయ కోణం ఉందా: జీవన్ రెడ్డి
బ్యాంకులకు మానవీయ కోణం ఉండాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పడం బాగానే ఉంది కానీ అసలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మానవీయ కోణం ఉందా? అని కాంగ్రెస్ నేత టి. జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బిసి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకాకపోవడం దురదృష్టకరమని అన్నారు. రైతులను బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన విమర్శించారు.