తెలంగాణ

కరడు గట్టిన దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేస్తున్న కరడగట్టిన దొంగను అరెస్టు చేసి రూ.45 లక్షల విలువైన కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ నగర ఉత్తర మండల డిసిపి తెలిపారు. యాదగిరి జిల్లా బిబినగర్ ప్రాంతానికి చెందిన కోటిపల్లి చంద్రి అలియాస్ శేఖర్ (25)ను, నిందితుడి నుంచి దొంగ బంగా రం కొన్న అదే ప్రాంతానికి చెందిన నగల వ్యాపారి హీరాలాల్ సిర్వీ (33)ను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి డిసిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు చంద్రిపై హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 31 కేసులు నమోదయ్యాయి. వృత్తిరీత్యా కారు డ్రైవర్‌గా పని చేసే కోటిపల్లి చంద్రి మహాలక్ష్మిని వివాహం చేసుకున్నా డు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరిమధ్య తలెత్తిన కుటుంబ తగాదాల కారణంగా భార్య ఇద్దరు పిల్లలతో విడిపోయి ఎటో వెళ్లిపోయింది.
కాగా వెనె్నల అనే మరో మహిళతో ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని గడుపుతున్నాడు. చంద్రి క్రమేణా దొంగతనాలకు పాల్పడ్డం ప్రారంభించాడు. ఇళ్లలో కన్నం వేయడంలో ఆరితేరాడు. తొలిసారి మెదక్ పోలీసులు 2007లో అరెస్టు చేశా రు. మరో రెండు సార్లు కూడా వేర్వేరు కేసుల్లో అరెస్టు అయి బెయిల్‌పై విడుదలయ్యాడు. హైదరాబాద్ సిపి పరిధిలోని మార్కెట్, మహంకాళి, బోయిన్‌పల్లి, చిలకలగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఒక్క మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోనే 14 కేసులు నమోదు అయ్యాయి. నిందితుడి నేరచరిత్ర ఆధారంగా పిడి చట్టాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు డిసిపి తెలిపారు.