తెలంగాణ

సమ్మె విషయంలో తొందరపడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: సమ్మె విషయంలో తొందరపడవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ రేషన్ డీలర్లను కోరారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా కమిషన్ పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమ యం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఓపిక పట్టాలని ఆయన కోరారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ప్రత్యామ్నా య మార్గాలు ఆలోచించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు నుంచి సమ్మెకు దిగుతామని కొంత మంది రేషన్ డీలర్ల యూనియన్ నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో కమిషనర్ ఆనంద్ వారితో రెండు రోజుల (గురు, శుక్రవారాలు) పాటు సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ వారితో మాట్లాడుతూ రేషన్ డీలర్ల ఆదాయం పెరిగేలా రేషన్ షాపుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇందులో భాగంగానే నగదు రహిత లావాదేవీలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో ఈ-పాస్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేషన్ డీలర్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఆధార్ ద్వారా చేసే లావాదేవీలన్ని రేషన్ షాపుల్లో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ఈ-పాస్ యంత్రాల ద్వారా నిర్వహించుకోవచ్చని, 2.75 కోట్ల మంది ఆధా ర్ వివరాలు పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. రేషన్ షాపులన్నీ మినీ సూపర్ మార్కెట్‌లుగా మార్చాలన్న ప్రతిపాదన ఉందన్నారు. వీలైనంత త్వరగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కమిషనర్ చెప్పారు.
గౌరవ వేతనం ఇవ్వండి
ఇలాఉండగా రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం, సిసి కెమెరాలు, బినామీ డీలర్లు, బోగస్ కార్డుల ఏరివేత, స్వైపింగ్ విధానాలను తాము స్వాగతిస్తున్నామని రేషన్ డీలర్లు తెలిపారు. కాగా ఈ పరిస్థితు ల్లో రేషన్ డీలర్లకు కనీసం గౌరవ వేతనం చెల్లించాలని, ఇన్సురెన్స్, హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలని వారు కోరారు.