తెలంగాణ

జిఎస్‌టిలో మంచికి స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: జిఎస్‌టిలో మంచికి స్వాగతం పలుకుతున్నాం, అదే విధంగా ప్రజలకు నష్టం కలిగిస్తుంది అన్న అంశాలను వ్యతిరేకిస్తున్నట్టు శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. జాతీయ పార్టీ అని చెప్పుకొనే టిడిపి జిఎస్‌టి, నియోజక వర్గాల పునర్విభజన, రాష్టప్రతి ఎన్నికలు తదితర అంశాల్లో ఆంధ్రలో ఒక మాట తెలంగాణలో ఒక మాట మాట్లాడుతోందని విమర్శించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా నియోజక వర్గాల పునర్విభజన చేయాల్సిన అవసరం లేదని టిడిపి భావిస్తుందా? అని ప్రశ్నించారు. రేవంత్ ఆయన మామ జైపాల్‌రెడ్డి టిఆర్‌ఎస్‌పై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. నెల రోజుల జైలు అనుభవం ఉన్న రేవంత్‌కు మళ్లీ చిప్పకూడు తప్పదని అన్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో కేంద్రం తీసుకు వచ్చిన జిస్‌టి అంశంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండదని, రాష్ట్రాలు అవునన్నా కాదన్నా ఆగదని అన్నారు.