తెలంగాణ

జిఎస్‌టిపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: దేశ వ్యాప్తంగా శుక్రవారం అర్థరాత్రి నుంచి వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి రానున్న నేపధ్యంలో దీని ప్రభావం వివిధ రంగాలపై పడుతుందని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. జిఎస్టీ భారం, పన్నుల శ్లాబ్ రేట్, మిగిలిన శ్లాబులు తదితర అంశాలను పేర్కొంటూ నిర్థిష్ట ప్రతిపాదనలు తయారు చేసి అఖిల పక్షం తరఫున ఢీల్లీ వెళ్లి వినతి పత్రం సమర్పించాలని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కెసిఆర్‌కు సూచించారు. జిఎస్టీ నుంచి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా మినహాయించాలని, వ్యవసాయ ఉపకరణాలు, ఉత్పత్తులపై ఎలాంటి భారం వేయవద్దని విజ్ఞప్తి చేశారు. శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాపిత నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయంచామన్నారు.