తెలంగాణ

లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చెరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించలేదని ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులు హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఐఎఎస్ అధికారులు రంజీవ్ ఆచార్య, సందీప్ కుమార్ సుల్తానియా, ఏ వాణి ప్రసాద్‌లు కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొన్నారు. హైకోర్టుకు ఇచ్చిన మాటకు కట్టుబడి తాము నియమావళిని ఉల్లంఘించలేదని వారు కోర్టుకు తెలిపారు. ఈ కేసును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ టి రజని విచారించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది ఈ అఫిడవిట్లను కోర్టుకు సమర్పించారు. ఈ ముగ్గురు ఐఎఎస్‌లు కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు వచ్చిన కేసును కోర్టు మూసివేసింది.
పహాడి షరీఫ్ ఎన్నికలకు లైన్ క్లియర్
రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్ గ్రామ పంచాయితీ ఎన్నికలకు లైన్ క్లియరైంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ గ్రామ పంచాయితీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఇచ్చిన నోటిఫికేషన్‌పై సింగిల్ జడ్జి కోర్టు గతంలో స్టే ఇచ్చింది. ఈ స్టేను హైకోర్టు ధర్మాసం కొట్టివేసింది. సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పి నవీన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.