తెలంగాణ

ఆన్‌లైన్ డ్రగ్ లైసెన్స్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: మెరిట్, ఆన్‌లైన్ డ్రగ్ లైసెన్స్ విధానాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోని మొదటిసారి ఆన్‌లైన్ డ్రగ్ లైసెన్సింగ్ విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ ప్రమోషన్‌లో భాగంగా కొత్త ఆన్‌లైన్ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆన్‌లైన్ డ్రగ్ లైసెన్సింగ్ విధానాన్ని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి శుక్రవారం సచివాలయంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ ద్వారానే మ్యానుఫాక్చరర్స్, హోల్ సేల్, రిటైలర్స్‌కి అవసరమైన అన్ని అనుమతులు అందిస్తామన్నారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవడం నుంచి లైసెన్స్ పొందే వరకు, రెనివల్స అన్నీ జరుగుతాయని ఆయన తెలిపారు. దీని ద్వారా సమయం ఆదా అవడమే కాకుండా మధ్యవర్తులు, లంచాల వంటి సమస్యలకు చెక్ పడుతుందన్నారు. ఈజీ డూయింగ్ బిజినెస్ కింద ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఇలాఉండగా మంత్రి లక్ష్మారెడ్డి మెరిట్ ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించారు. మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఇన్ తెలంగాణ వల్ల వైద్య విద్యలో అధ్యాపకులు, విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పరిశోధనల పత్రాలను పంపించడం నుంచి వాటి సమీక్ష, అనుమతుల వంటి అన్ని అంశాలు కూడా ఇక ఆన్‌లైన్‌లోనే చేసుకునే వీలు కలుగుతుందన్నారు.