తెలంగాణ

సిఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి రేషన్ డీలర్ల విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: కమీషన్ పద్దతిని రద్దు చేసిన ప్రభుత్వం తమకు నెలసరి జీతాలను చెల్లించటంతో పాటు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు శుక్రవారం సిఎం క్యాంపు ఆఫీసును ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు. ముందస్తుగా సమాచారం తెల్సుకున్న పోలీసులు సిఎం క్యాంపు కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆఫీసు ముట్టడికి యత్నించిన డీలర్లను ఏసిపి వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ రవీందర్‌ల నేతృత్వంలో పోలీసులు డీలర్లను క్యాంపు కార్యాలయం ఎదుట అడ్డుకుని అరెస్టు చేసి, గోషామహల్ స్టేడియంకు తరలించారు. ఇదే ముట్టడికి హజరయ్యేందుకు వస్తున్న 85 మంది డీలర్లను రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి, మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధుల్లో అరెస్టులు చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో తాము సమ్మె చేపట్టి, ఆందోళనను ఉద్దృతం చేస్తామని రేషన్ డీలర్లు ప్రకటించారు. దీంతో పౌరసరఫరాల శాఖ కమీషనర్ సి.వి. ఆనంద్ రేషన్ డీలర్లతో శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపారు. కమీషన్ పద్దతి రద్దయినా, డీలర్లకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నిర్ణయం తీసుకుంటుందని ఆనంద్ నచ్చజెప్పారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే వరకు ఓపికగా ఉండాలని, తొందరపడి సమ్మెకు చేపట్టరాదని డీలర్లకు సూచించారు.
న్యాయమైన డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన రేషన్ డీలర్లను అరెస్టు చేయటాన్ని కాంగ్రెస్ శాసన మండలి నేత షబ్బీర్ అలీ, ఉప నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు ఖండించారు. అరెస్టు అయిన డీలర్లను వారు గోషామహల్ స్టేడియంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కనీసం రేషన్ డీలర్లకు గౌరవ వేతనాలను కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవటం విచారకరమన్నారు.