తెలంగాణ

రాష్టప్రతి అభ్యర్థి మీరాకుమార్‌కు మజ్లిస్ మద్దతు కోరతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: రాష్టప్రతి పదవి కోసం యుపిఎ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మీరా కుమార్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా మజ్లిస్ పార్టీని కోరనున్నట్లు టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మజ్లిస్ నేత, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని కలిసి కోరనున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. అంతకు ముందు వస్త్ర వ్యాపారుల అసోసియేషన్ నాయకులు పలువురు శుక్రవారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి జిఎస్‌టి వల్ల వస్త్ర వ్యాపారానికి కలిగే నష్టం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిఎస్‌టి వల్ల వస్త్ర వ్యాపారం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సబ్‌కా వికాస్ అంటున్నారు కానీ జిఎస్‌టి దెబ్బతో సబ్‌కా సర్వనాశ్ అయ్యేలా ఉందని అన్నారు. వస్త్ర వ్యాపారుల ఉద్యమానికి ఆయన మద్దతు పలికారు. వారి తరఫున తామూ ఉద్యమం చేస్తామన్నారు. జిఎస్‌టి వల్ల చిన్న వస్త్ర వ్యాపారులకు కలిగే నష్టం గురించి ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరించి పార్లమెంటులో పోరాటం చేయాల్సిందిగా కోరనున్నట్లు ఆయన చెప్పారు. జిఎస్‌టిని తట్టుకునే స్థోమత వస్త్ర వ్యాపారులకు లేదన్నారు. సింగిల్ పాయింట్‌లో పన్ను విధిస్తే మోయలేని భారం అవుతుంది కాబట్టి చిన్న వ్యాపారులకు పన్ను మినహాయింపునివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వస్త్ర వ్యాపారుల బాధలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉత్తమ్ విమర్శించారు.
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను మొరపెట్టుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు బయలుదేరిన రేషన్ డీలర్లను ఎక్కడికక్కడే అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీలర్లకు పూర్తి స్థాయిలో పని కల్పించాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

చిత్రం.. గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న పిసిసి నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి