తెలంగాణ

జీఎస్టీని సమర్థిస్తూనే అభ్యంతరాలూ చెప్పాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) అమలు వల్లన తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ.2500 కోట్ల అదాయనికి నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం జీఎస్టీ అమలును సమర్థిస్తూనే, తమ అభ్యంతరాలను కేంద్రానికి తెలియాజేశామని చెప్పారు.
అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.8500 కోట్ల అదాయం కేంద్రానికి సమకూరుస్తూంటే, కేంద్రం నుంచి తెలంగాణ వాటా కేవలం రూ.6000 కోట్లు మాత్రమే తిరిగి వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, భగీరథ వంటి పథకాల కాంట్రాక్టులకు 18శాతం పన్నులు విధించడంపై తమ అభ్యంతరాలు కేంద్రానికి తెలియజేసినట్టు చెప్పారు.
గత 40 రోజులుగా కొనసాగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో 145 వస్తువులపై పన్ను తగ్గించాలని వివిధ రాష్ట్రాలను నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి 35 వస్తువులపై పన్నులు తగ్గించాలని కేంద్రాన్ని కోరినట్టు పేర్కొన్నారు.
కొన్ని వస్తువులపై పన్నులు ఎక్కువ వేయడం వల్ల లాభ నష్టాలు రెండు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.జీఎస్టీ పన్నుల విధానంలో ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని, అవసరమైతే జీఎస్టీ అమలును నాలుగు నెలలు వాయిదా వేయాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం సూచించిందని చెప్పారు.