తెలంగాణ

హరిహర శర్మకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల ట్రస్టు కార్యదర్శి తుమ్మలపల్లి హరిహర శర్మ(78)కు శుక్రవారం అంబర్‌పేట స్మశానవాటికలో ఆయన కుమారుడు అంతిమసంస్కారాన్ని నిర్వహించారు. సంఘ్, బిజెపి, ఎబివిపి , విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యానిపుణులు, కార్యకర్తలు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల ట్రస్టు అధ్యక్షుడు జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
సరూర్‌నగర్ నివాసం నుండి హరిహర శర్మ భౌతిక కాయాన్ని నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి తీసుకువచ్చారు. అక్కడ అభిమానుల సందర్శనార్ధం అర్ధగంట పాటు ఉంచారు. అక్కడి నుండి నేరుగా అంబర్‌పేటకు తరలించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఎంఎల్‌సి ఎన్ రామచందర్‌రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్ ఇంద్రసేనారెడ్డి, శాస్తవ్రేత్త సతీష్‌రెడ్డి, ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ, బిఎంఎస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సురేంద్ర, ఎబివిపి సంయుక్త ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణ్, క్షేత్ర ప్రచారక్ శ్యాంకుమార్, ప్రాంత కార్యకారిణి సభ్యులు ఆర్ మల్లికార్జునరావు తదితరులు హరిహర శర్మ భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ హరి హర శర్మ అంకిత భావంతో సంఘ్‌కు, ఎబివిపికి పనిచేశారని అన్నారు. జాతి కోసం, జాతీయత భావ దృక్పథాన్ని పెంచడంలోనూ హరిహరి శర్మ చేసిన సేవలు గొప్పవని చింతల రామచంద్రారెడ్డి అన్నారు. సమాజం పట్ల తపన వున్న వ్యక్తి శర్మ అని శాస్తవ్రేత్త సతీష్‌రెడ్డి అన్నారు. గొప్ప వ్యక్తిని కోల్పోయామని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఎంఎస్‌ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ డివిజి కృష్ణ మాట్లాడుతూ విద్యారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది నివాళులు అర్పించారు. సంఘ్ నేతగా శర్మ సేవలు అందరికీ మార్గదర్శకమని ఎబివిపి కార్యదర్శి అయ్యప్ప అన్నారు.

చిత్రం.. శుక్రవారం హైదరాబాద్‌లో సామాజిక కార్యకర్త హరిహరశర్మ భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న బిజెపి నేతలు లక్ష్మణ్, రామచందర్‌రావు, చింతల తదితరులు