తెలంగాణ

అసమర్థపాలనతో ఆందోళనలో రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ముఖ్యమంత్రి అసమర్ధపాలన వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలను పూర్తిగా అమలుచేయడం లేదని అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని, 54 లక్షల మంది రైతులలో 10 శాతం మంది రైతులు కూడా ఫసల్ బీమా యోజనలోకి రాకపోవడంతో రైతులకు తీవ్రమైన నష్టం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 40 శాతం మేర పంటలను విధిగా పంటల బీమా పథకంలో చేర్పించాలనే లక్ష్యం విధించినా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, దీనికి రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని శుక్రవారం నాడు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు కిసాన్ మోర్చ నిర్వహించిన భారీ ధర్నాలో ప్రసంగిస్తూ లక్ష్మణ్ పేర్కొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒకే విడత రుణ మాఫీ చేసిందని, టిఆర్‌ఎస్ మాత్రం నాలుగు విడతలుగా రుణమాఫీ చేయడం, అది సక్రమంగా అమలుచేయకపోవడం వల్ల రైతుల ఖాతాల్లో వడ్డ్భీరం అలాగే ఉందని, 17వేల కోట్ల రుణమాఫీ చేశామని ప్రభుత్వం అంటోందని, కానీ ఆలస్యం కావడం వల్ల 42వేల కోట్లు అప్పుగా మారిందని అన్నారు. పూర్తి రుణమాఫీ కాకపోవడం వల్ల బ్యాంకులు తిరిగి రుణాలు ఇవ్వడం లేదని, దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించనక్కర్లేదా అని ప్రశ్నించారు. రాష్టవ్య్రాప్తంగా 14 లక్షల మంది కౌలు రైతులు న్నా, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడంలో వారికి రుణాలను ఇప్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. నకిలీ విత్తనాలు వరదలా పారుతున్నాయని, మూడు సంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనలో లక్షలాది మంది రైతులు నకిలీ విత్తనాల వల్ల తీవ్ర ఆర్ధిక నష్టానికి గురయ్యారని అన్నారు. ఈ మధ్య కాలంలో పోలీసులు విత్తన సంస్థలపై దాడులు నిర్వహిస్తే పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు బయటపడ్డాయని, గత మూడేళ్లుగా ఈ ప్రభుత్వం ఏం చేసిందని, ఇందులో ఏం మతలబు ఉందని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో గోదాములు నిర్మించడానికి, ఈనాం మార్కెట్‌లు ఏర్పాటుకు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి విరివిగా ఆర్ధిక సాయం అందించినా రాష్ట్రప్రభుత్వ అసమర్ధతత వల్ల అవి నత్తనడక సాగుతున్నాయని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, సిఎం క్యాంపు కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు.

చిత్రం.. శుక్రవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట
కిసాన్ మోర్చ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బిజెపి నేత లక్ష్మణ్ తదితరులు