తెలంగాణ

‘ఔటర్’ నిర్వహణ ఇక ప్రైవేటుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించిన 158 కి.మీ ఔటర్ రింగ్ రోడ్ (ఒఆర్‌ఆర్) నిర్వహణ బాధ్యతలను త్వరలో ప్రైవేటు ఏజెన్సీలకు టిఒటి పద్దతిలో అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఒఆర్‌ఆర్ నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలెప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) నిర్వహిస్తోంది. అయితే సిబ్బంది, నిధుల కొరత, ఇతర ఇబ్బందుల దృష్ట్యా ఒఆర్‌ఆర్ నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీ చేతికి ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తాజాగా ఈ అంశంపై అధికారులతో చర్చించారు.
టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (టిఒటి) పద్దతిలో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని హెచ్‌ఎండిఏ అధికారులతో జరిపిన చర్చల్లో మంత్రి స్పష్టం చేశారు. సుమారు 20 నుంచి 30 ఏళ్లపాటు టిఒటి పద్దతిలో అప్పగిస్తే ఔటర్ రింగ్ రోడ్ దశ దిశ పూర్తిగా మారుతుందని భావిస్తున్నారు. టోల్ వసూలు చేసే అవకాశం ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ఒఆర్‌ఆర్ నిర్వహణ బాగా మెరుగుపడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడం వల్ల అవసరమైన చోట్ల ఫుడ్ ప్లాజా, వినోదాత్మక పార్కుల ఏర్పాటు, భద్రత కోణంలో చేపట్టే అనేక చర్యల వల్ల నిర్వహణ సమర్ధవంతంగా ఉంటుందని యోచిస్తోంది.
ఇంకా టిఒటికి అప్పగించడం వల్ల సోలార్ విద్యుత్‌ను వినియోగించుకునేందుకు, ఎల్‌ఇడి బల్బులను ఔటర్ కారిడార్ మొత్తం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ఈమధ్యే నానక్‌రామ్‌గూడ నుంచి శంషాబాద్ వరకు 22 కి.మీ దూరం ఎల్‌ఈడి లైటింగ్‌ను హెచ్‌ఎండిఏ ఏర్పాటు చేసింది. ఔటర్ నిర్వహణ బాధ్యత ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం ద్వారా రూ.2000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఆ ఏజెన్సీ నుంచి వస్తుందని, ఈ నిధులను వినియోగించి మరిన్ని కొత్త వౌళిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టేందుకు వీలుంటుందని మంత్రి వద్ద జరిగిన చర్చల సందర్భంగా వెల్లడైంది.
టిఒటి తరహా పద్దతి గత రెండేళ్ల నుంచి దేశంలో పలు చోట్ల అమలు జరుగుతోంది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్న ఆర్థిక వ్యవహారాల మంత్రి వర్గ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టిఒటి వ్యవస్థను అమలు చేయాలంటే సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసి తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాల సమాచారం.