తెలంగాణ

అణచివేత ధోరణిలో ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 30: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాల కారణంగా వ్యాపారులు, ప్రజలు తమకు జరిగే అన్యాయం గురించి అడిగే పరిస్థితి లేకుండా పోతోందని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ వచ్చాక వ్యాపారాలు నడపలేని పరిస్థితులు ఏర్పడినట్లు వ్యాపారులు వాపోతున్నారని తెలిపారు. వస్తవ్య్రాపారంపై జిఎస్‌టిని ఉపసంహరించాలని, రిటైల్ వ్యాపారంలో బహుళజాతి సంస్థల ప్రవేశాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యాపారుల జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని హన్మకొండ చౌరస్తాలో ధర్నా, వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అమెజాన్, రిలయన్స్, డి-మార్ట్ వంటి బహుళజాతి సంస్థల రాకతో రిటైల్ వ్యాపారాలు దెబ్బతిన్నాయని, తాజాగా వాల్‌మార్ట్ సంస్థ రంగప్రవేశం చేస్తుండటంతో రిటైల్ వ్యాపారుల పరిస్థితి మరింత దిగజారుతుందని చెప్పారు. బహుళజాతి సంస్థలు పోటాపోటీగా రిటైల్ రంగంలో స్టోర్లు ఏర్పాటు చేస్తుండటంతో సామాన్య వ్యాపారులు తమ షాపులను మూసివేయలవలసిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల అసంఘటిత రంగానికి చెందిన లక్షలాదిమంది కార్మికులు రోడ్డునపడే ప్రమాదం ఉందని అన్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ జరగకపోవటం, అటు బహుళజాతి సంస్థల కారణంగా వ్యాపారాలు మూతపడటం, వ్యవసాయం లాభసాటిగా లేక రైతులు ఆందోళనకు గురవుతుండటం, కుటీర పరిశ్రమలకు ఆదరణ లేకపోవటంతో తెలంగాణ భవిష్యత్తు ఏమిటని అన్ని వర్గాలలో ఆందోళన మొదలయిందని తెలిపారు.
రిటైల్ రంగాన్ని కాపాడుకోవటం అంటే బతుకుతెరువును కాపాడుకోవటమని, యువత ఉపాధిని కాపాడుకోవటమని కోదండరామ్ చెప్పారు.
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి వి.హన్మంతరావు మాట్లాడుతూ ప్రజాఉద్యమాలకు కేంద్రమైన వరంగల్ నుంచి రిటైల్ మార్కెట్‌లో వాల్‌మార్ట్ ప్రవేశాన్ని అడ్డుకోవటానికి ఉద్యమం ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతు దశాబ్ధాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాల ద్వారా తెలంగాణను తెచ్చుకుంటే బహుళజాతి సంస్థల ప్రవేశం ద్వారా రిటైల్ వ్యాపారం దెబ్బతిని సామాన్య వ్యాపారులు, కార్మికులు రోడ్డునపడే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. వాల్‌మార్ట్ వంటి బహుళజాతి సంస్థల ప్రవేశాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

చిత్రం.. వ్యాపారులు నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న టిజెఎసి చైర్మన్ కోదండరాం