తెలంగాణ

జిల్లా కేంద్రాల్లో పోలీస్ కాంప్లెక్స్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జూన్ 30: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో రూ.12 కోట్లతో పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్‌శాఖకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు. అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, అంతే ప్రాధాన్యతను శాంతిభద్రతలకు ఇస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరును ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు పలుమార్లు ప్రశంసించినట్లు స్వయంగా సిఎం కేసిఆర్ వెల్లడించారని తెలిపారు. పోలీస్ శాఖకు రూ.500 కోట్లతో ఆధునిక వాహనాలను సమకూర్చామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం పలు చర్యలు తీసుకున్నారని, నగరాలతోపాటు పట్టణాలలో ప్రజల సహకారంతో సిసి కెమెరాల ఏర్పాట్లు, హోంగార్డుల వేతనాల పెంపు తదితర చర్యలు తీసుకున్నారని తెలిపారు. నగరంలోని పంజాగుట్ట, ఆదిభట్లలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్లు ఆధునిక సౌకర్యాలతో కూడి ఉన్నాయని, ఇవి కార్పొరేట్ కార్యాలయాలుగా ఉన్నాయన్నారు. రూ. 2కోట్లతో కొత్తగా పోలీస్ స్టేషన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే వారికోసం రూ.25లక్షలతో రిసెప్షన్ కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణ సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో డిపివో కార్యాలయంతోపాటు పోలీస్ పరేడ్ గ్రౌండ్, హెలీపాడ్ తదితర నిర్మాణాలు చేపడతా మన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ క్వార్టర్లు అధ్వాన్నంగా ఉన్నాయని వాటి స్థానంలో దశలవారీగా ఆధునిక సౌకర్యాలతో పోలీస్ క్వార్టర్లను నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని, ఆయన ఆలోచనా విధానాలకు అనుగుణంగా క్వార్టర్ల నిర్మాణం చేపడుతామన్నారు. జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ మాట్లాడుతూ, జిల్లాలోని మన్ననూర్, అచ్చంపేట, సిద్దాపూర్‌లలో కొత్తగా పోలీస్ స్టేషన్ల భవనాలను నిర్మించామని, త్వరలోనే వాటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 25లక్షలతో నాగర్‌కర్నూల్‌తోపాటు 8 పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ కేంద్రాలను నిర్మించినట్టు తెలిపారు. జెసి సురేందర్ కరణ్, ఏఎస్పీ అనసూయ, డిఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.