తెలంగాణ

నైపుణ్యాభివృద్ధికి అధిక నిధులివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: తెలంగాణలో నైపుణ్యాభివృద్ధికి అధిక నిధులను మంజూరు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీకి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. దత్తాత్రేయ శుక్రవారం ఇక్కడ కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీతో భేటీ అయ్యారు. తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కాగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద తెలంగాణకు రూ.80 కోట్లు విడుదల చేయనున్నట్టు రూడీ తెలిపారని ఆయన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణలోని 25 ఐటిఐలను కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన స్ట్రైవ్ పథకంలో చేర్చి, ప్రతేకంగా నిధులను కేటాయించాలని రాజీవ్ ప్రతాప్ రూడీని కోరానని తెలిపారు. అలాగే రాష్ట్రంలో రెండు అంతర్జాతీయ స్థాయి డ్రైవింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వగానే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాజీవ్ ప్రతాప్ వెల్లడించాలని తెలిపారు. హైదరాబాద్ ఐటి హబ్‌గా ఉన్నందున బలహీన వర్గాల విద్యార్థులకు కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇప్పించి ఆ సంస్థల్లో ఉపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నట్టు రూడీ తెలిపారని ఆయన చెప్పారు.