తెలంగాణ

ఉద్రిక్తతకు దారితీసిన ఇళ్ల స్థలాల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్,జూన్ 30: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పేదలకు పట్టా సర్ట్ఫికెట్లు ఇచ్చిన స్థలంలో గుడిసెలు వేసేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు వాకిటి సునీతారెడ్డి ఆధ్వర్యంలో 2014లో అర్హులైన 1370 మంది పేద వారిని గుర్తించి ఇళ్ల స్థలాల కోసం పట్టా సర్ట్ఫికెట్లు ఇచ్చారు. అయతే మూడు సంవత్సరాలు గడిచినా వారికి ఇళ్ల స్థలాలు చూపడంలో అధికారలు నిర్లక్ష్యం చూపుతుండటం పట్ల నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 16న ఆర్డీఓ వెంకటేశ్వర్లును కలిసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్థానిక నర్సాపూర్- వెల్ధుర్తి ప్రధాన రహదారిపై గల మార్కెట్‌యార్డు ఎదుట గల భూమిలో లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ గుడిసెలు వేసేందుకు ఉపక్రమించింది. దీంతో తూప్రాన్ డిఎస్‌పి భాస్కర్ ఆధ్వర్వర్యంలో పోలీసులు పెద్ధ సంఖ్యలో నర్సాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో మోహరించి బారికేడ్లు, తాళ్లు ఏర్పాటు చేశారు. నర్సాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, లబ్ధిదారులతో వస్తున్న వారిని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దాంతో మాజీ మంత్రి సునీతారెడ్డి పోలీసులకు మద్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. భూ అక్రమణలకు తాము వెళ్లడం లేదు అధికారులు పట్టాలు ఇచ్చిన స్థలాన్ని మాత్రమే అక్రమించేందుకు వెళ్తున్నామని చెప్పినప్పటికీ పోలీసులు అక్కడికి వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. దాంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు సునీతారెడ్డితో పాటు నాయకులు ఆంజనేయులుగౌడ్, మల్లేశ్, సత్యంగౌడ్, నయిం, ఆంజనేయుగౌడ్, రమణారావు తదితరులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈవిషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, పట్టా సర్ట్ఫికెట్లు పొందిన లబ్ధిదారులు పెద్ధ సంఖ్యలో స్టేషన్‌కు తరిలివచ్చి ఆందోళనకు దిగారు. అనంతరం సునీతారెడ్డితో పాటు పలువురు నాయకులను స్వంత పూచికత్తుపై విడుదల చేశారు.
పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి..
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని మాజీ మంత్రి సునీతారెడ్డి డిమాండ్ చేశారు. నర్సాపూర్‌లో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నర్సాపూర్‌లోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఉద్దేశ్యంతో అధికారులతో సర్వే చేయించి 1370మందికి ఇళ్ల పట్టాలు అందించడం జరిగిందని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. గతంలో ఇచ్చిన స్థలంలో గుడిసెలు వేసేందుకు ఉపక్రమించగా అధికారాన్ని అడ్డంపెట్టుకొని అరెస్టులకు దిగడం సరైందికాదని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన సర్ట్ఫికెట్లను పరిగణలోకి తీసుకొని డబల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాం డ్ చేశారు. పెద్ధ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్రం.. నర్సాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులకు సునీతారెడ్డికి మధ్య వాగ్వాదం