తెలంగాణ

బలహీనంగా రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: తెలంగాణలో నైరుతీ రుతుపవనాలు తాత్కాలికంగా బలహీనపడ్డాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా ఇతర జిల్లాల్లో పెద్దగా వర్షాలు లేవు. ఆకాశం మేఘాలతో ఉన్నప్పటికీ, వర్షాలు తీసుకువచ్చే మేఘాలు లేకపోవడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నైరుతీ రుతుపవనాలు తెలంగాణలో బలహీనంగా ఉన్నాయని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంచార్జి) వైకె రెడ్డి ప్రకటించారు. మళ్లీ బంగాళాఖాతంలో తుపాన్లు లేక అల్పపీడనం ఏర్పడితే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా ఉండగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో వర్షాలుబాగానే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, కేరళ తదితర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండి వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో మరో నాలుగురోజుల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇలా ఉండగా మరోవైపు నైరుతీ రుతుపవనాలు మరింత ముందుకు కదులుతున్నాయి. హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో విస్తరించాయని వెల్లడించారు.