తెలంగాణ

హైదరాబాద్ శివారులో కొత్తగా ఐదు మున్సిపాల్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో కొత్తగా ఐదు మున్సిపాల్టీలఏర్పాటుకు సిఎం కెసిఆర్ అమోదం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు అధికార వర్గాల సమాచారం. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐదు మున్సిపాల్టీలలో మీర్‌పేట, జల్‌పల్లి, జిల్లెలగూడెం, బోడుప్పల్, ఫిర్జాదిగూడ ఉన్నాయి. ఇవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. మీర్‌పేట మున్సిపాల్టీ పరిధిలోకి బాలాపూర్‌లో కొంత భాగం, జల్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలోకి కొత్తపేట, వెంకటాపూర్ గ్రామాలు, ఫిర్జాదిగూడ మున్సిపాల్టీ పరిధిలోకి మేడిపల్లి గ్రామం విలీనం కానుండగా, బోడుప్పల్‌లో మున్సిపాల్టీ ఏర్పాటుకు సరిపడ జనాభా కలిగి ఉండటంతో బోడుప్పల్ మొత్తంగా ఒక మున్సిపాల్టీగా ఏర్పాటు చేయాలని పట్టణాభివృద్ధిశాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి యధాతథంగా ఆమోదించినట్టు అధికార వర్గాల సమాచారం. గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తొమ్మిది మున్సిపాల్టీలు ఏర్పాటు కాగా ప్రస్తుతం మరో ఐదు మున్సిపాల్టీలు కొత్తగా ఏర్పాటు కాబోతున్నాయి.