తెలంగాణ

ప్రజలను మభ్య పెట్టేందుకే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 1: దేశ చరిత్రలో ఇంతకముందెన్నడూ లేని రీతిలో శాసన సభ సంప్రదాయాలను ఖూనీ చేసి సిఎం కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసి ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని పిసిసి చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం నల్లగొండలో ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్.్భస్కర్‌రావు, ఉత్తమ్ పద్మావతిలతో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సిఎం కెసిఆర్ చెబుతున్న ప్రాజెక్టుల రీడిజైనింగ్ కేవలం కమిషన్ల కోసమే తప్ప నీళ్ల కోసం కాదంటు ఉత్తమ్ నిప్పులు చెరిగారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో ఏదో జరిగిపోతుందంటు ప్రాజెక్టులన్నీ ఐదేళ్లలో పూర్తయిపోయి తెలంగాణ అంతటా నదీ జలాలు పారుతాయన్నట్లుగా మరోసారి కెసిఆర్ ప్రభుత్వం ప్రజలను కలల్లోకి నెట్టిందన్నారు. నిజంగా తెలంగాణ సస్యశ్యామలం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ముందుగా నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎల్‌బిసి, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే లక్షల ఎకరాలు పారుదలలోకి తీసుకరావాలన్నారు. తమ తప్పులు బయటపడతాయనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు గైర్హాజరయ్యారన్న కెసిఆర్ విమర్శలను ఉత్తమ్ కొట్టిపారేశారు. శాసన సభ సంప్రదాయాలను పరిరక్షిస్తూ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను సభలో కాకుండా శాసన సభ కమిటీ హాల్‌లో పెట్టాలని కాంగ్రెస్ చేసిన సూచనను ప్రభుత్వం తోసిపుచ్చిందన్నారు. సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తే తదుపరి తమకు కూడా అందుకు అవకాశం కల్పించాలని కోరామన్నారు. అయితే ప్రభుత్వం తమ ప్రతిపాదనలను తోసిపుచ్చి ఏకపక్షంగా సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు పూనుకున్నందున తాము సభకు వెళ్లలేదన్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదన్నారు. రీడిజైన్ల పేరుతో కాలయాపన మినహా ఒక్క ప్రాజెక్టు పని మొదలు పెట్టలేదని ఎన్నాళ్లకు పూర్తవుతాయోనన్న గందరగోళం నెలకొందన్నారు. మహారాష్టత్రో మహాఒప్పందం అంటు రాజధానిలో ఊరేగింపులు తీసుకుని తీరా ఎలాంటి ఒప్పందాలు లేవంటూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాట మార్చిందన్నారు. తమ్మిడిహెట్టి ఎత్తును తగ్గించి తెలంగాణ ప్రయోజనాలను మహారాష్టక్రు తాకట్టుపెట్టారని విమర్శించారు. తమ్మిడి హట్టి ఎత్తు తగ్గించకపోతే 80కిలోమీటర్ల మేరకు గ్రావిటీ ఫ్లో తెలంగాణకు లభించేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకం పెద్ద స్కామ్ అంటు ఉత్తమ్ ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గత ప్రభుత్వాల ఖాతాలో వేయడం అలవాటుగా మారిందన్నారు. టిఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలను ప్రజలకు శాసన సభ ద్వారా వివరించామన్నారు. కరువు మండలాల గుర్తింపులో, సహాయక చర్యల అమలులో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.

చిత్రం నల్లగొండలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి