తెలంగాణ

తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌కి గోరీ కడతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణవంక, జూలై 16: 2019 ఎన్నికల్లో తెలంగాణ ప్రజ లు టిఆర్‌ఎస్ పార్టీకి గోరీ కడతారని టిపిసిసి అధ్యక్షు డు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆదివారం వీణవంక మండల కేంద్రంలో ఓ శుభకార్యానికి హాజరై అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పనుల్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయని, ఆ పథకం పేరుతో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి తనయుడు కెటిఆర్ దోచుకుంటున్నారని అన్నారు. పోలీసులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, గులాబీ కండువాలు కప్పుకొని విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. దీనికి బలమైన ఆరోపణ అధికార బలంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షున్ని ఇటీవల జరిగిన ఓ కార్పొరేటర్ హత్య కేసులో ముద్దాయిగా పోలీసులు ఇరికించారని దుయ్యబట్టారు. కెటిఆర్ ఓ బచ్చా అని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్పక తప్పదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, వారు పండించిన ధాన్యానికి ఇప్పటివరకు సగం వరకు కూడా డబ్బులు అందలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల నకిలీ విత్తనాల కుంభకోణం భారీగా జరిగి రైతులను నష్టపర్చేవిధంగా ఆ శాఖ మంత్రులు అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇప్పటివరకు నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన వారిపై కేసులు నమో దు చేయలేదని అన్నారు. రుణాలపై రైతులను రాష్ట్ర ప్రభు త్వం మోసం చేస్తుందని అన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, టిఆర్‌ఎస్ పార్టీ బండారం బయటపెట్టక తప్పదని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం, కాంగ్రెస్ నాయకులు చల్మెడ లక్ష్మినర్సింహారావు, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, ప్యాట రమేష్, తుమ్మేటి సమ్మిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పరిపాటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.