తెలంగాణ

ఇచ్చినమాట నిలబెట్టుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జూలై 16: కాంగ్రెస్ పార్టీ, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ భిక్ష వల్లే నేడు టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందన్న వాస్తవాన్ని గుర్తించి యువరాజు కెటిఆర్, సేనాధిపతి హారీష్‌రావులు నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఏఐసిసి కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 8వ తేదిన కరీంనగర్ జిల్లాలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత పార్టీ అని ఆ పార్టీ నాయకులు నకిలీ నాయకులని హారీష్‌రావు మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని తెలంగాణ రాకుంటే యువరాజు, సేనాధిపతి అయి ఉండే వారు కాదని ఆయన అన్నారు. బ్రిటీష్ వారితో పోరాడి స్వంతత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇటీవలే వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ నేతలు విమర్శించడం హస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీకి నష్టం జరిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మాటను నిలుపుకున్నదని ఆయన అన్నారు. మోసపూరిత మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నది టిఆర్‌ఎస్ పార్టీ, ఆ పార్టీ నాయకులేనని చిన్నారెడ్డి అన్నారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని, ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని మోసపూరిత మాటలు చెప్పి వాటిని అమలు చేయడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కెటిఆర్‌కు ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆశతో అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.