తెలంగాణ

పాలమూరు ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 16: పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు పనె్నండు లక్షల ఎకరాలకు కృష్ణాజలాలను అందించి రైతులకు వ్యవసాయ సాగుకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజాపూర్ గ్రామం నుండి కుతినేపల్లి గ్రామానికి రూ.10 కోట్ల ఖర్చుతో నిర్మాణం చేపడుతున్న డబుల్ బీటీ రోడ్డు నిర్మాణం పనులకు మంత్రి లక్ష్మారెడ్డి శ్రీకా రం చుట్టారు. ఈ సందర్భంగా రాజాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత పాలకులు పాలమూరు జిల్లాను పూర్తి వెనకకు నెట్టేశారని ఆరోపించారు.
గత కాంగ్రెస్, టిడిపి పాలనలో జిల్లా ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. ఓ నాయకుడు జిల్లాను దత్తత తీసుకుని దగా చేశారని ఆరోపించారు. మరో నాయకుడు ప్రాజెక్టుల పేరిట ఇక్కడ కాల్వలు తవ్వి పోతిరెడ్డిపాడు ద్వారా తమ ప్రాంతానికి కృష్ణాజలాలను దోపిడీ చేశారని దుయ్యాబట్టారు. 60 ఏళ్ల పాలనలో ఇంకా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదంటే అది ఎవరి నిర్లక్ష్యమని ఆయన ప్రశ్నించారు. నీరు, నిధులు, నియామకాలను సైతం దోచుకుని వెళ్లారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు జిల్లా అభివృధ్దిలో ముందడు వేస్తుందని అన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు సైతం వేగవంతంగా జరుగుతున్నాయని అన్నా రు. గత సంవత్సరం ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పనులను పూర్తి దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని ఈ ఏడాది కూడా మరో నాలు గు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వబోతున్నామని మంత్రి వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పరిధిలోని నార్లాపూర్, ఏదుల, కర్వేనా రిజర్వాయర్ పనులు జోరుగా కొనసాగుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. కర్వేనా రిజర్వాయర్ నుండి సొరంగం మార్గం ద్వారా ఉదండాపూర్ రిజర్వాయర్‌లోకి కృష్ణాజలాలను తరలించడం జరుగుతుందని ఆ పనులను ఇప్పటికే ప్రారంభించామని అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన ఉదండాపూర్ రిజర్వాయర్ భూసేకరణ పనులు కూడా జరుగుతున్నాయని అన్నా రు. జిల్లాలో దాదాపు ఇప్పటికే రూ.3624 కోట్ల వ్యయం తో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని మరో రూ.750 కోట్ల పనులు ప్రతిపాదనలతో ఉన్నాయని వాటికి కూడా త్వరలోనే మోక్షం లబిస్తుందని అన్నారు.

చిత్రం.. రాజాపూర్ నుండి కుతినేపల్లి గ్రామం బిటిరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి