తెలంగాణ

ఒక్క ఓటూ వృథా కావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: రాష్టప్రతి ఎన్నికలకు జరిగే పోలింగ్‌లో ఎక్కడా పొరపాట్లు జరుగకుండా ఈ ప్రక్రియపై ఎమ్మెల్యేలకు పూర్తి అవగాహన కల్పించాలని పార్టీ సీనియర్ నేతలను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదివారం జరిగిన మాక్ పోలింగ్‌కు హాజరుకాని వారి కోసం మరోసారి సోమవారం ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. రాష్టప్రతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై పార్టీ ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేయడానికి తెలంగాణ భవన్‌లో ఆదివారం పార్టీ శాసనసభా పక్షం సమావేశం, మాక్ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ రోజున ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రులు కడియం శ్రీహరి, హరీష్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే పోలింగ్ ఏజెంట్లుగా కొప్పుల ఈశ్వర్, గొంప గోవర్దన్‌ను నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్డీయే బలపరిచిన రాష్టప్రతి అభ్యర్థి కోవింద్‌కు టిఆర్‌ఎస్ మద్దతు ప్రకటించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ ఒక్క ఓటు కూడా వృథా కాకుండా జాగ్రత్తగా ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యేలంతా టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగానికి సహకరించాలని, సభ్యత్వ నమోదుకు ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్నారు.

గైర్హాజరుపై కెసిఆర్ ఆగ్రహం
* ముఖ్యమైన సమావేశానికి రాకపోవడం ఏమిటి? *హాజరుకాని ఎమ్మెల్యేలు, మంత్రిపై అసహనం
‘ఇంత ఇంపార్టెంట్ మీటింగ్‌కు రాకపోవడం ఏమిటీ’ అని టిఆర్‌ఎస్ శాసనసభా సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు, మంత్రిపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభా పక్ష సమావేశం, మాక్ పోలింగ్‌కు ముఖ్యమంత్రి స్వయంగా హాజరైనప్పటికీ కొంత మంది ఎమ్మెల్యేలతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి గైర్హాజర్ కావడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి గైర్హాజర్ అయిన ఎమ్మెల్యేల వివరాలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రి లక్ష్మారెడ్డి తన నియోజకవర్గం జడ్చర్లలో ఒక సమావేశానికి హాజరై బయలుదేరినట్టు సమాచారం ఇచ్చిన విషయాన్ని పల్లా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.

చిత్రం.. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్