తెలంగాణ

పూర్ణిమ ఆచూకీ లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: గత నెల 7న కూకట్‌పల్లి నిజాంపేటలో అదృశ్యమైన పదోతరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ లభించింది. 40 రోజుల క్రితం అదృశ్యమైన పూర్ణిమను ముంబయి పోలీసులు అదుపులో తీసుకుని బాలసుధార్‌కు తరలించారు. అనంతరం హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత నెల 14న ఉదయం స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో పూర్ణిమ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజులైనా పూర్ణిమ ఇంటికి రాకపోవడంతో రాష్టమ్రంత్రి కెటిఆర్ మూడు కమిషనరేట్ల పోలీసులను ట్విట్టర్‌లో ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు 14 బృందాలుగా విడిపోయి విద్యార్థిని పూర్ణిమ కోసం గాలించారు. అయినా పూర్ణిమ ఆచూకీ లభించలేదు. పూర్ణిమ అదృశ్యమైన నాటి నుంచి ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాలుగు రోజుల క్రితం పూర్ణిమ కిడ్నాప్ అయినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సినిమాల్లో నటించాలనే కోరిక పూర్ణిమకు ఉందని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ముంబై, చెన్నై సహా పలుచోట్ల వెతికారు. అన్ని స్టూడియోలను సంప్రదించారు. కాగా ముంబయి దాదర్‌లోని ఓ స్టూడియో వద్ద ఉన్న పూర్ణిమను ఆదివారం సాయంత్రం పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులో తీసుకుని బాల్ సుధార్ అనే ఎన్జీవోలో చేర్పించారు. హైదరాబాద్ పోలీసులు ముంబయి పోలీసులను ఆశ్రయించడంతో పూర్ణిమను గుర్తించారు. ఎట్టకేలకు పూర్ణిమ అదృశ్యం కథ సుఖాంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుండగా పూర్ణిమను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ఓ ప్రత్యేక పోలీస్ బృందం ముంబయి వెళ్లిందని బాచుపల్లి సిఐ బాలకృష్ణారెడ్డి తెలిపారు.