తెలంగాణ

రైలు ప్రయాణికుల దోపిడీ ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: రైలు ప్రయాణికులను దోచుకునే ముఠా గుట్టు రట్టయింది. క్రైం ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ స్క్వాడ్ (సిపిడిఎస్) బృందం ఇద్దరు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మలక్‌పేటకు చెందిన నల్ల రాఖేష్ (21), దమ్మాయిగూడకు చెందిన గాజుల రాజేష్‌లు రైళ్లలో ప్రయాణికుల దృష్టి మరల్చి వారి వస్తువులు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. వీరి వద్ద నుంచి సుమారు ఒక లక్ష రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రజాసంబంధాల ముఖ్య అధికారి ఉమాశంకర్ కుమార్ తెలిపారు. గత నెల 14న సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళ మెడలోని 36 గ్రాముల బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. అదేవిధంగా గత నెల సూరారం శ్రావణ్‌కుమార్ (21) అనే యువకుడు రైలు ప్రయాణికులను దోచుకున్నాడు. అతని వద్ద నుంచి 45 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిపిఆర్‌వో పేర్కొన్నారు.