తెలంగాణ

రాజకీయాలకు అతీతంగా కోవింద్‌కు మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: రాష్టప్రతి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం తరఫున రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వానికి రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయిలో మద్దతు నివ్వాల్సిన అవసరం ఉందని టిడిఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డి, బిజె ఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి కోరారు. టిడిపి శాసనసభ పక్ష కార్యాలయంలో టిడిఎల్పీ, బిజెఎల్పీలకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. తమ మద్దతుతో పాటు ఇతరుల మద్దతును కూడగట్టే విధంగా చూడాలని నిర్ణయించినట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చర్చించామని అన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, బిజెపి ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, ప్రభాకర్, టిడిపి ముఖ్య నేతలు నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం.. టిడిపి శాసనసభ పక్ష కార్యాలయంలో ఆదివారం జరిగిన టిడిఎల్పీ, బిజెఎల్పీ సంయుక్త సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు