తెలంగాణ

రాష్టప్రతి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: రాష్టప్రతి ఎన్నికల సందర్భంగా సోమవారం నిర్వహించే పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శాసనసభ ఆవరణలో కమిటీ హాలు-1లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి (సిఇవో) భన్వర్‌లాల్, పార్లమెంటు సెక్రటరీ జనరల్ తరఫున పరిశీలకునిగా వచ్చిన కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ సెక్రటరీ సుశీల్ కుమార్, శాసనసభ కార్యదర్శి రాజాసదారామ్ ఆదివారం మరోసారి పోలింగ్ కేంద్రాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ఇలా ఉండగా తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ 130, ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా లెక్కిస్తారు. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఉండగా నామినేటెడ్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు ఓటు హక్కు లేదు. దీంతో మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ 15,708. అలాగే రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలు ఉండగా వీరికి తమ సొంత రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ వారంతా పార్లమెంట్‌లోనే తమ ఓకు హక్కు వినియోగించుకోవడానికి ఢిల్లీకి ముందే వెళ్లిపోయారు. పోలింగ్ సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి మంగళవారం ఉదయం విమానంలో ఢిల్లీకి తీసుకుని వెళ్ళి పార్లమెంటులో అప్పగిస్తారు.

చిత్రం.. శాసనసభ ఆవరణలో రాష్టప్రతి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కేంద్ర పరిశీలకుడు సుశీల్‌కుమార్, చీఫ్ ఎలక్టోరల్ అధికారి భన్వర్‌లాల్, శాసనసభ కార్యదర్శి సదారామ్