తెలంగాణ

కెజిబివిల కోసం కేంద్రంతో కొట్లాడుతున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలంటే (కెజిబివిలు) తనకు చాలా ఇష్టమని, ఇక్కడ తల్లిదండ్రులు లేనివారు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరే ఉన్నవారు, కడు పేద కుటుంబాల పిల్లలు చదువుతున్నారని, వీరికి మించి విద్య వసతులు కల్పించేందుకు కేంద్రం వల్ల తాను ప్రతి సారీ కొట్లాడుతున్నానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేవంలోనే తెలంగాణ రాష్ట్రంలో కెజిబివిలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారని చెప్పారు. తెలంగాణలో 391 కెజిబివిలున్నాయని, వీటిలో 71,500 మంది విద్యార్ధులున్నారని వివరించారు. వీటితో పాటు కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాల్లో ఈ ఏడాది 84 కెజిబివిలు ఏర్పాటు చేస్తున్నామని, వీటన్నింటిలో ప్రయోగాత్మకంగా ఇంగ్లీషు మీడియం ప్రారంభిస్తున్నామని తెలిపారు. కెజిబివిలకు ప్రహరి గోడలు లేవని, పడుకోవడానికి సరైన వసతులు లేక అలాగే కాలేజీ విద్యార్ధినులు పడుకునేవారని, తాను విద్యాశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 391 కెజిబివిల్లో 371 కెజిబివిలకు ప్రహరి గోడలు ఏర్పాటు చేశామని అన్నారు.
మిగిలిన 14 కెజిబివిలకు కూడా కాంపౌండ్ వాల్స్ మంజూరు చేసినా, భూ వివాదాల వల్ల అవి పూర్తికాలేదని అన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం 391 కెజిబివిలలో సిసి కెమరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి కెజిబివిలో డ్యూయల్ డెస్క్‌లు ఇస్తున్నామని మొత్తం 17700 డ్యూయల్ డెస్క్‌లు అవసరం కాగా వీటి తయారీ బాధ్యతను జైళ్లశాఖకు అప్పగించామని తెలిపారు. ఇప్పటికే 13,400 డ్యూయల్ డెస్క్‌లు కెజిబివిలకు అందాయని వివరించారు. అలాగే కెజిబివి విద్యార్ధులకు ట్రంక్ బాక్స్‌లు , వంట పాత్రలు, గ్లాసులు, ప్లేట్లు కూడా ఇవ్వాలని నిర్ణయించామని, 60 కెజిబివిలకు అదనపు బ్లాక్‌లు నిర్మించాల్సి ఉందని, వాటి కోసం 125 కోట్లు రూపాయిలు కేటాయించామని చెప్పారు. కొత్తగా వచ్చిన 84 కెజిబివిలలో 34 కెజిబివిల పక్కా భవనాల కోసం కేంద్రం నుండి 90 కోట్ల 72 లక్షల రూపాయిలు మంజూరు అయ్యాయని అన్నారు. వసతుల కల్పన కోసం కెజిబివిలకు 90 కోట్ల 66 లక్షలు ఏటా ఖర్చు చేస్తున్నామని , మొత్తంగా 306.33 కోట్ల రూపాయిలను కెజిబివిల కోసం వ్యయం చేస్తున్నామని చెప్పారు. 391 పాత కెజిబివిలు, 84 కొత్త కెజిబివిలు మొత్తం 475 కెజిబివిల నిర్వహణ ఖర్చు నిమిత్తం ఏటా 242 కోట్ల రూపాయిలు ఇస్తున్నామని అన్నారు. వసతుల నిర్మాణం కోసం 306 కోట్ల రూపాయిలు, నిర్వహణకు 242 కోట్లు, వెచ్చిస్తామని వివరించారు. ప్రభుత్వం కెజిబివిలపై ప్రత్యేకంగా దృష్టిసారించిందని, వాటి అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. గతంలో స్పెషల్ ఆఫీసర్ల వేతనాలు 15వేల నుండి 20వేలకు పెంచామని, సిఆర్టీల వేతనం 9 వేల నుండి 15వేలకు పెంచామని ఈ ఏడాది స్పెషల్ ఆఫీసర్ల వేతనాలు 20వేల నుండి 25వేలకు, సిఆర్‌టిల వేతనం 15వేల నుండి 20వేలకు పెంచుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజల్లో నమ్మకం పెరిగి అంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్ధులు తగ్గారని, ప్రస్తుతం కేంద్రం 6,7 తరగతులకు సాయం అందిస్తోందని, 8.9.10 తరగతులకు రాష్టమ్రే భరిస్తోందని, కేంద్రం సాయం 10వ తరగతి పెంచాలని కోరామని, కేంద్రం అంగీకరిస్తే రాష్ట్రం ఇంటర్ వరకూ ఆర్ధిక సాయం చేస్తుందని అన్నారు.
కేంద్రం నలుగురు టీచర్లకు మాత్రమే డబ్బు ఇస్తోందని, రాష్ట్రం అదనంగా మరో ముగ్గురిని నియమించిందని చెప్పారు. గురుకులాల్లో, మోడల్ స్కూళ్లలో ఒకే రకమైన భోజనం అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యను పటిష్టం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో కెజిబివి డైరెక్టర్ శ్రీహరి, ఎస్‌ఎస్‌ఎ అదనపు పిడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.