తెలంగాణ

హైదరాబాద్‌లో కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, జూలై 17: బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా ఆకాశం మేఘావృతం అయి ఉన్నా వర్షం మాత్రం చిరుజల్లులతో సరిపెట్టుకుంది. కాగా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. భారీ వర్షం కారణంగా నగరంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షంతో పంజాగుట్ట, లక్డీకాపూల్, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, బేగంపేట, కోఠి, అబిడ్స్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. పంజాగుట్ట ప్రధాన రహదారిపై మోడల్ హౌస్ వద్ద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అమీర్‌పేట మైత్రీవనం వద్ద, ఎస్సార్‌నగర్ మానసిక వైద్యశాల వద్ద రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే బోనాల సందర్భంగా సోమవారం కూడా సెలవు కావడంతో నగర రోడ్లపై ట్రాఫిక్ సమస్య అంతగా కనిపించలేదు. భారీ వర్షంతో ఖైరతాబాద్‌లోని మారుతీనగర్, బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా, ఇందిరానగర్, అశోక్‌నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో బస్తీవాసులు ఇబ్బందులు పడ్డారు.
నగరవాసుల సంతోషం
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భావించినా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ 1వ తేదీ నుంచే వర్షాలు ప్రారంభం అయినా సాధారణ వర్షపాతానికే పరిమితం అయింది. బోనాల సందర్భంగా తగినంత వర్షాలు కురవాలను అమాత్యుల నుంచి సాధారణ భక్తులు మొక్కుకున్న రెండు రోజుల్లోనే నగరంలో భారీ వర్షం కురియడంతో నగరవాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చిత్రాలు.. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి జలమయమైన రోడ్లపై అవస్థపడుతున్న వాహనదారులు

ఆంధ్రభూమి బ్యూరో