తెలంగాణ

దాడిచేసి.. దుస్తులు చించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 17: మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం రోడ్డుపై నడుచుకుకుంటూ వెళుతున్న ఒక యువతిని ఇద్దరు యువకులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లారు. యువతి దుస్తులు చించి, అకారణంగా దాడి చేసిన సంఘటన ఇక్కడ సంచలనం రేకెత్తించింది. మహబూబాబాద్ జిల్లా సికింద్రాబాద్ తండాకు చెందిన రవళి అనే యువతిని తన మాజీ ప్రియుడు, మహబూబాబాద్ పట్టణానికి చెందిన మదాసు మల్లేష్, అతని స్నేహితుడు సునీల్‌తో కలిసి యువతిని ఆటో ఎక్కమని బలవంతం చేసారు. ప్రియుడితో గొడవ కారణంగా గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న ఆ యువతి ఆటో ఎక్కేందుకు నిరాకరించింది. అయినప్పటికీ బలవంతంగా ఆ యువతిని ఆటోలో ఎక్కించుకొని తాళ్లపూసలపల్లి సమీపంలోకి తీసుకెళ్లారు. దీంతో రవళి కేకలు వేయడంతో అరవద్దని ఆమెపై దాడి చేసారు. దుస్తులు చించివేసారు. దీంతో రవళి కేకలు విని స్థానికులు రావడంతో వారు అక్కడి నుండి పరారయ్యారు. స్ధానికులు వెంటనే రవళిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.