తెలంగాణ

గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల రిక్రూట్‌మెంట్‌పై స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల నియామకానికి ఈ నెల 30న జరగాల్సిన ప్రాథమిక పరీక్షపై హైకోర్టు సోమవారం నాడు స్టే విధించింది. రాష్టవ్య్రాప్తంగా మహిళా డిగ్రీ గురుకులాల్లో 546 లెక్చరర్ పోస్టుల నియామకం కోసం జూన్‌లో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కేవలం మహిళలు మాత్రమే అర్హులని ప్రకటనలో కమిషన్ పేర్కొంది. నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ మెదక్ జిల్లాకు చెందిన యువకుడు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం మహిళలకు మాత్రమే అర్హత కల్పిస్తూ, పురుషులకు అవకాశం కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది బూర రమేష్ వాదించారు. దీనికి స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 30న టిఎస్‌పిఎస్సీ నిర్వహించ తలపెట్టిన పరీక్షను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.