తెలంగాణ

కోదండరాం అరెస్టు.. విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ములుగు, జూలై 17: కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపు బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రాజకీయ జెఎసి చైర్మన్ ఆచార్య కోదండరాంను సోమవారం సిద్దిపేట జిల్లా బహిళింపూర్‌లో పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసు వాహనాలను భూ నిర్వాసితులు అడ్డుకొని ధర్నాకు దిగడంతోపాటు వాహనాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటుతుందని భావించిన సిఐ సతీశ్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు శ్రీశైలం, శ్రీ్ధర్, కమలాకర్, వీరన్న, మహబూబ్‌అలి నేతృత్వంలో పోలీసులను రంగంలోకి దించి రైతులు, గ్రామస్తులను చెదరగొట్టారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాంను గౌరారం మీదుగా గజ్వేల్ మండల పరిధిలోని బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నంలో కోదండరాంకు, గజ్వేల్ సిఐ సతీశ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే పోలీసు వాహనాన్ని ఎక్కేందుకు కోదండరాం నిరాకరించడంతో ఆయన వాహనాన్ని గౌరారం వరకు ఫాలో చేస్తూనే అక్కడి నుండి పోలీసులు కోదండరాంను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించి భారీ బందోబస్తు మధ్య తరలించారు.
కాగా బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు సైతం ముంపు బాధితులు, జెఎసి నేతలు, పౌర హక్కుల నాయకుల, దళిత సంఘాల శ్రేణులు పెద్దఎత్తున తరలి రావడంతో అక్కడ సైతం ఉద్రిక్తతకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన పోలీసులు సుమారు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కోదండరాంను సొంత పూచీకత్తుపై వదిలిపెడుతున్నట్టు ప్రకటించారు. కాగా కోదండరాం వెంట వచ్చిన హైకోర్టు న్యాయవాది రచనారెడ్డిని కూడా అరెస్టు చేసి గౌరారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

చిత్రాలు.. బహిళింపూర్‌లో పోలీసులను అడ్డుకున్న భూ నిర్వాసితులు... అరెస్టు చేస్తున్న సిఐ సతీశ్‌తో కోదండరాం వాగ్వాదం