తెలంగాణ

మొక్కలు నాటి... రంగులు వేసి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూలై 17: బెల్జియం దేశానికి చెందిన ఫార్శితెర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల బృందం దండుమల్కాపురం శివారులోని వెబ్బర్ చైల్డ్ హోం భవన సముదాయానికి శ్రమదానంతో రంగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులోని ఇన్‌ఫాంట్స్ డీలాపెక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెబ్బర్ చైల్డ్ హోంకు బెల్జియం దేశానికి చెందిన ఫార్శితెర్ స్వచ్ఛంద సంస్థకు చెందిన 12 మంది సభ్యుల బృందం ఈనెల 13న వచ్చారు. వెబ్బర్ చైల్డ్ హోం భవన సముదాయానికి శ్రమదానంతో రంగులు వేస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఏదో ఒక దేశానికి వెళ్లి పాఠశాల భవన నిర్మాణాలకు ఆర్ధిక సాయం అందించడంతో పాటు ఇక్కడే కొంత కాలం ఉండి శ్రమదానం చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ యేడాది వెబ్బర్ చైల్డ్ హోంను ఎంపిక చేసుకున్నారు. ఆగస్టు 3వ తేదీ వరకు ఇక్కడే ఉండి భవనాలన్నింటికీ రంగులు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమానికి ముగ్ధులై తాము సైతం అంటూ మొక్కలు నాటారు. ప్రకృతికి సంబంధించిన పాటలను ఫ్రెంచి భాషలో పాడారు. హరితహారంలో తాము సైతం అంటూ ఇద్దరు చిన్నారులు పాల్గొని మొక్కలు నాటి నీరు పోసారు. ఈ కార్యక్రమంలో వెబ్బర్ చైల్డ్‌హోం డైరెక్టర్ భానుతేజ, చైర్మన్ జ్యోతి కోటేశ్వర్‌రావు, ప్రతినిధులు లూసీ, ఫాబ్రిస్, ఎల్‌డి, మేరీ, కేథరిన్, అన్, బ్రిజీత్, అర్నాండ్, రోజ్, బావే, జెరార్డ్‌లు పాల్గొన్నారు.

చిత్రాలు.. హరితహారంలో పాల్గొని మొక్కలు నాటుతున్న బెల్జియం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు...
*వెబ్బర్ చైల్డ్ హోంలో భవనాలకు శ్రమదానంతో రంగులు వేస్తున్న దృశ్యం