తెలంగాణ

అడ్వకేట్ ఆన్ రికార్డ్, స్టాండింగ్ కౌన్సిల్ కాలపరిమితి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్‌గా పనిచేస్తున్న శెట్టి ఉదయకుమార్ సాగర్, స్టాండింగ్ కౌన్సిల్ పి. వెంకటరెడ్డిల కాలపరిమితిని తాత్కాలికంగా పెంచారు. 2014 జూలై 19 న అడ్వకేట్ ఆన్ రికార్డ్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన ఉదయకుమార్ సాగర్ పదవీ కాలం 2017 జూలై 18 తో ముగియగా, 2014 జూలై 31 న స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి పదవీ కాలం ఈ నెల 30 తో ముగుస్తుంది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పనిచేసేందుకు అడ్వకేట్ ఆన్ రికార్డ్, స్టాండింగ్ కౌన్సిల్ అవసరం అన్నివేళల్లో ఉంటుంది. కొత్తవారిని ఈ పోస్టుల్లో నియమిస్తారా, వీరికే మళ్లీ అవకాశం ఇస్తారా అన్న విషయం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుపై ఆధారపడి ఉంటుంది. న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు పేరుతో మంగళవారం జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు ఉదయకుమార్, వెంకటరెడ్డి ఈ పదవుల్లో కొనసాగుతారు.