తెలంగాణ

వరంగల్ డిసిసి నేతపై కేసులు ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: వరంగల్ జిల్లా తమ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిపై రాజకీయ వత్తిళ్ళ కారణంగా పెట్టిన కేసులను ఎత్తి వేయాలని రాష్ట్ర డిజిపిని కోరగా సానుకూలంగా స్పందించారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్వర్యంలో పలువురు నేతలు డిజిపిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వరంగల్‌లో మురళి హత్య కేసులో లొంగిపోయిన నిందితులు కాంగ్రెస్ నేత రాజేందర్ రెడ్డికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా పోలీసులు కేసు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. ఇదే విషయాన్ని డిజిపికి వివరించామని ఆయన తెలిపారు. హత్యతో సంబంధం లేని రాజేందర్‌రెడ్డి, శ్రీమాన్, శేఖర్‌లపైనా కేసు పెట్టారని ఆయన చెప్పారు. రిమాండ్ రిపోర్టులోనూ తమ పార్టీ నాయకుని కుట్ర ఉన్నట్లు రాయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రోడ్డు ప్రమాదంలో కుమారున్ని కోల్పోయి దుఖంలో ఉన్న రాజేందర్ రెడ్డిపై కుట్ర కేసు పెట్టారని ఆయన తెలిపారు. సిరిసిల్లలో దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగంతో 8 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు తనకు తాను ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని సిఎల్‌పి ఉప నేత టి. జీవన్‌రెడ్డి అన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబంతో మీరు పోల్చుకుంటారా?, మీది మోసాల కుటుంబం అని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. తెలంగాణకు అసలైన ద్రోహులు టిఆర్‌ఎస్ నాయకులేనని విమర్శించారు.