తెలంగాణ

నేటి నుండి ఎమ్సెట్ తుది విడత కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: ఇంజనీరింగ్ కాలేజీల్లో యుజి కోర్సులో చేరేందుకు తుది విడద కౌనె్సలింగ్ షెడ్యూలు విడుదల చేసినట్టు కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ తెలిపారు. సర్ట్ఫికేట్ల పరిశీలన 19న జరుగుతుందని, వెబ్ ఆప్షన్లు 19,20 తేదీల్లో చేయవచ్చని, సీట్ల కేటాయింపు 22న జరుగుతుందని ఆమె వివరించారు. ఇంజనీరింగ్‌లో 64,300 సీట్లకు 56,046 సీట్లు కేటాయించామని, ఫార్మసీలో 2958 సీట్లకు 151, డి ఫార్మలో 440 సీట్లకు 44 సీట్లు కేటాయించామని ఆమె చెప్పారు. ఇంతవరకూ ఇంజనీరింగ్‌లో 42,529 మంది, బి ఫార్మసీలో 113 మంది, డి ఫార్మలో 32 మంది చేరారని చెప్పారు.
ఆర్బిట్రేషన్ రంగంలో రెండు రోజుల శిక్షణ
అసొచమ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిసొల్యూషన్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ , ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రీజనల్ సెంటర్ సంస్థల ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ రంగంలో రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు రీజనల్ కన్వీనర్ జెఎల్‌ఎన్ మూర్తి తెలిపారు. ఆర్బిట్రేషన్ రంగంలో మెళుకువలను తెలియజేసే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన చెప్పారు. ఇతర వివరాలను 9899111216 నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు.
విద్యార్థులపై నిర్బంధాలు
విద్యార్థులపై సమైక్య రాష్ట్రంలో లేని నిర్బంధాలను తెలంగాణ రాష్ట్రం ఉపయోగిస్తోందని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో నాన్‌బోర్డర్లు తెలంగాణ బిడ్డలు కాదా అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి నేడు వారిని హాస్టళ్ల నుండి ఖాళీ చేయించాలని ఆదేశించడం దారుణమని అన్నారు. టిఆర్‌ఎస్‌కు చెందిన నేతలు యూనివర్శిటీలో ఏళ్ల తరబడి ఉన్నవారేనని గుర్తుచేశారు.
గ్రూప్-1 ఇంటర్వ్యూ బోర్డులో ఐఎఎస్‌లు
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే గ్రూప్-1 ఇంటర్వ్యూ బోర్డులో ఐఎఎస్‌లు సభ్యులుగా చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌పి సింగ్ జీవో 1554ను జారీ చేశారు. ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు బోర్డులో సభ్యులుగా ఉండాలని, ఒక వేళ వారు లేకున్న పక్షంలో సంబంధిత శాఖాధిపతిని వారి తరఫున నామినేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
22 గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 22 గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు అనుమతించిందని సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.ఇందులో 15 అమ్మాయిలకు , ఏడు అబ్బాయిలకు కేటాయించినట్టు చెప్పారు. ఈ గురుకులాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న ఎస్టీ అమ్మాయిలు, అబ్బాయిలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వీటిలో బిఎస్సీ, బికాం, బిఎ కోర్సులను ఆఫర్ చేయనున్నట్టు చెప్పారు.
జెఎన్‌టియు ఫలితాలు విడుదల
జెఎన్‌టియు ఇంజనీరింగ్, ఫార్మసీ ఫలితాలను ప్రకటించింది. ఇంజనీరింగ్ ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్, ఫార్మసీ ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్, థర్టు ఇయర్ సెకండ్ సెమిస్టర్, సెకండియర్ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్ బిటెక్ పరీక్షలకు 43,546 మంది రిజిస్టర్ చేసుకోగా వారిలో 14,526 మంది ఉతీర్ణులయ్యారు. ఫార్మసీ 3/2లో 3894 మంది రిజిస్టర్ చేసుకోగా 1556 మంది పాసయ్యారు. 2/2లో 4198 మంది రిజిస్టర్ చేసుకోగా 2038 మంది, 1/2లో 4198 మందికి 1277 మంది పాసయ్యారు.
టిజిటి, పిడి రిక్రూట్‌మెంట్‌కు పరీక్షలు
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ పిజిటి, పిడి రిక్రూట్‌మెంట్‌కు మెయిన్ పరీక్షలను నిర్వహించింది.ఉదయం సెషన్‌లో 1912 మంది అభ్యర్థులకు 1748 మంది, సాయంత్రం నిర్వహిచిన సెషన్‌లో 1867 మందికి 1706 మంది హాజరయ్యారు.