తెలంగాణ

హైదరాబాద్‌లో భద్రత పటిష్ఠతకు సింక్రోనీ ఫైనాన్షియల్‌తో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ తమ హాక్-ఐ అప్లికేషన్‌ను సింక్రోనీ ఫైనాన్షియల్ ఉపయోగించే రవాణా సేవల అప్లికేషన్‌కు అనుసంధానంపై ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా మరింత సింక్రోనీ ఫైనాన్షియల్ ఉద్యోగుల భద్రత బలోపేతం అవడంతోపాటు హైదరాబాద్‌లో భద్రతకు భరోసా కల్పిస్తుందని నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఇక నుంచి సింక్రోనీ ఫైనాన్షియల్ ‘మూవ్ ఇన్ సింక్’ పేరుతో రవాణా భద్రత పరిష్కారానికి వినియోగిస్తుంది. జిపిఎస్ ట్రాకింగ్, భద్రతా అలారం యాప్‌ను తమ రవాణా సేవల కోసం వినియోగిస్తుంది. పోలీస్ తక్షణ అలర్ట్స్ పొందడంతోపాటు ఉద్యోగులకు తక్షణ సహాయం అందించేందుకు తోడ్పతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో నగర కమిషనర్ మహేందర్‌రెడ్డితోపాటు సింక్రోని ఫైనాన్షియల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫైసల్ ఉద్దీన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, అదనపు కమిషనర్ స్వాతిలక్రా తదితరులు పాల్గొన్నారు. సింక్రోనీ ఫైనాన్షియల్ ‘మూవ్ ఇన్ సింక్ యాప్’ వాహనాల లైఫ్ ట్రాకింగ్, అధిక వేంగంగా ప్రయాణిస్తే హెచ్చరిక, వాహనాలు అగినప్పుడు హెచ్చరిక, జియో ఫెన్‌స అతిక్రమణను హెచ్చరిక చేస్తూ ఉపయోగపడుతుంది. క్యాబ్ పానిక్ అలారం డివైజ్, మొబైల్ యాప్ ఎన్‌ఓఎస్‌కు ఇది ఎంతో తోడ్పడుతుందని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

చిత్రం.. విలేఖరులకు వివరాలు తెలియజేస్తున్న
నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, సింక్రోని వైస్ ప్రెసిడెంట్ ఫసలుద్దీన్