తెలంగాణ

మా కష్టాలు తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: అంబులెన్స్ సర్వీసు నిర్వహణ సంస్ధ అయిన జివికె-ఇఎంఆర్‌ఐ సంస్ధలు కార్మిక చట్టాలకు విరుద్ధంగా తమతో 12 గంటలు పని చేయిస్తున్నాయని తెలంగాణ 108 అంబులెన్స్ ఉద్యోగుల సంఘం నాయకులు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పల్లె అధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను, రంగారెడ్డి జిల్లా జాయింట్ కమిషనర్‌ను, హెల్త్ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మిగతా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల తరహాలో తమకూ 8 గంటల పని విధానాన్ని అమలు చేయించాలని వారు కోరారు. కార్మికుల చట్టాలను ఉల్లంఘించి ఉద్యోగులతో పని చేయిస్తుండడం వల్ల వారు పని వత్తిడికి గురై గుండె పోటుతో మరణిస్తున్నారని, మరి కొందరు అనారోగ్యానికి గురవుతున్నారని అశోక్ పల్లె తెలిపారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో శంకర్ రెడ్డి, రామస్వామి గుండెపోటుతో మరణించారని ఆయన ఉదహరించారు. 12 గంటల పాటు ఉద్యోగం చేయడం వల్ల రాత్రి వేళల్లో నిద్దుర లేక మానసిక వత్తిడితో అంబులెన్స్ యాక్సిడెంట్‌కు గురికావడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకమైన 108 అంబులెన్స్ సర్వీసులు మరింత మెరుగ్గా ఉండాలంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, అంబులెన్స్‌లో పని చేసే డ్రైవర్లకు, ఇతర ఉద్యోగులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయించాలని అశోక్ కోరారు.