తెలంగాణ

స్కూల్ బ్యాగ్‌ల భారం తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: పాఠశాల విద్యార్థుల స్కూల్ బ్యాగుల భారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. స్కూల్ బ్యాగుల భారంపై ఇప్పటికే డజనుకు పైగా ప్రత్యేక కమిటీలు అనేక సిఫార్సులు చేసినా, విద్యార్ధుల బరువు తగ్గించేందుకు ఇంత వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనిపై ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో సైతం పిటీషన్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ బ్యాగుల భారంపై ప్రత్యేక జీవోను జారీ చేసింది. ప్రతి రోజు అవసరమైన పుస్తకాలను మాత్రమే తెచ్చుకునేలా విద్యార్ధులకు ముందుగానే మార్గదర్శకాలు ఇవ్వాలని, అలాగే విద్యార్ధులు తేలికగా పట్టుకెళ్లేలా మంచి బ్యాగులను కొనుగోలు చేయాలని, ఒకే భుజానికి బ్యాగు వేసుకునేలా కాకుండా బ్యాగు భారం మొత్తం రెండు భుజాలకు సమానంగా పడేలా రెండు వైపులా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. స్కూల్ అసెంబ్లీ వంటి సందర్భాల్లో ఎక్కడైనా కాసేపు నిల్చోవల్సి వస్తే బ్యాగ్‌ను కిందకు దించాలని, అలాగే అదనపు పాఠ్యపుస్తకాలు , నోట్ పుస్తకాలను తీసుకువచ్చేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని కూడా పేర్కొంది.
పాఠశాలలోని టీచర్లు స్కూల్ బ్యాగులను పరిశీలించి అనవసరపు బరువు తగ్గించుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆరు, ఏడు తరగతుల విద్యార్థుల బ్యాగు నాలుగు కిలోలకు మించరాదని, 8,9 తరగతుల విద్యార్థుల బ్యాగులు నాలుగున్నర కిలోలు మించరాదని, పదో తరగతి విద్యార్థుల బ్యాగు ఐదు కిలోలకు మించరాదని కూడా పేర్కొంది. ఒకటో తరగతి విద్యార్థుల బ్యాగు కిలోన్నర భారం దాటరాదని, 3,4,5 తరగతుల విద్యార్థుల బ్యాగులు రెండు నుండి మూడు కిలోల బరువు దాటరాదని పేర్కొంది.