తెలంగాణ

27, 28న డిఫెన్స్ పెన్షన్ ఆదాలత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: మాజీ సైనికోద్యోగులు, వితంతువులు లేదా ఆధారపడిన వారికి ఏవైనా పెన్షన్ సమస్యలు ఉన్నట్లయితే ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ‘పెన్షన్ ఆదాలత్’లో పరిష్కరించుకోవాలని తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కర్నల్ పి. రమేశ్ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఇఎంఇ సెంటర్, 3వ ట్రైనింగ్ బెటాలియన్ (షెడ్-2)లో అలహాబాద్ (పిసిడిఎ-పి) పెన్షన్స్, డిఫెన్స్ ప్రిన్సిపల్ కంట్రోలర్ పెన్షన్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ సైనికోద్యోగులు, వితంతువులు/డిపెన్‌డెంట్స్ (ఇఎస్‌ఎం)కు ఏవైనా సమస్యలు ఉంటే పెన్షన్ ఆదాలత్ అధికారి ఎస్‌కె శర్మ, ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, పెన్షన్, డ్రౌపాడి ఘాట్, అలహాబాద్-211 014కు పోస్టు ద్వారా లేదా మెయిల్ సిడిఎ-ఎఎల్‌బిడిఎట్‌దిరేట్‌ఆఫ్‌ఎన్‌ఐసి.ఇన్‌కు లేదా ఫాక్స్ 0532-2421873కి పంపించాలని సూచించారు. అదేవిధంగా వాటి ప్రతులను హైదరాబాద్, సోమాజిగుడాలోని రాజ్‌భవన్ రోడ్డులో గల సైనిక్ ఆరాంఘార్ కాంప్లెక్స్‌కూ పంపించాలని ఆయన తెలిపారు.